Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో నన్ను చిన్నచూపు చూశారు: సీనియర్ నటి 'షావుకారు' జానకి

  • నిర్మాతల వైపు నుంచి ఆలోచిస్తాను 
  • అప్పట్లో తమిళ .. కన్నడ చిత్రాలతో బిజీ
  • తమిళ ఇండస్ట్రీ నుంచి లభించిన ఆదరణ ఎక్కువన్న జానకి
వివిధ భాషల్లో నటిగా 'షావుకారు' జానకి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే 'షావుకారు' జానకి, ఇప్పటికీ ఊత్సాహంగా నటిస్తూనే వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "నేను ఏ సినిమా చేస్తున్నా ఆ సినిమా నిర్మాతను గురించి ఆలోచించేదానిని. ఇన్ని వందల సినిమాలు చేసినా ఎప్పుడూ వాళ్ల డబ్బుతో భోజనం చేయలేదు. నా భోజనాన్ని నేనే ఏర్పాటు చేసుకునే దానిని.

ఎవరి మీద ఆధారపడటం నాకు మొదటి నుంచి ఇష్టం ఉండదు. ఒక నటిగా నాకు ఆత్మ తృప్తిని ఇచ్చింది తమిళ చిత్ర పరిశ్రమ. తెలుగులో మాత్రం నన్ను చిన్న చూపే చూశారు. బహుశా నా వైపు నుంచి కూడా వాళ్లకి ఏవైనా లోటుపాట్లు కనిపించాయేమో. నేను తమిళ .. కన్నడ సినిమాలతో బిజీగా వుండి ఒకటి రెండు తెలుగు సినిమాలు వదిలేస్తే, ఈవిడ చేయదని అనుకున్నారేమో తెలియదు" అని చెప్పుకొచ్చారు.
Shavukaru Janaki

More Telugu News